ఛత్తీస్‌గఢ్‌లో భారీ సంఖ్యలో మవోయిస్టులు లొంగిపోయారు. కేంద్రం ఆదేశాలతో భద్రతా దళాల ఆపరేషన్ తో మనుగడ సాధించలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు మావోయిస్టులు. ఇప్పటికే చాలా మంది మావోలు.. బలగాల ఎన్ కౌంటర్ ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది లొంగిపోగా.. వందల మంది మావోలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికీ పోలీసులతో కలిసి భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం తమ ఆపరేషన్ ను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈక్రమంలో ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసులకు మావోలు లొంగిపోయారు.
బుధవారం కాంకేర్ జిల్లాలో 50 మంది మావోయిస్టులు లొంగిపోగా.. బీఎస్‌ఎఫ్ క్యాంపులో మరో 50 మంది, సుక్మా జిల్లాలో 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అయితే, లొంగిపోయిన మావోయిస్టులపై గతంలో రూ. 50 లక్షల రివార్డు ప్రకటన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముందుముందు మరికొంతమంది మావోలు లొంగిపోయే అవకాశం ఉంది. కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. 2026 మార్చి నాటికి దేశంలో మావోలను పూర్తిగా అంతం చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.