న్యూఢిల్లీ: వెస్టిండీస్ సిరీస్‌ని విజయవంతంగా పూర్తి చేసుకున్న భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో తొలి బ్యాచ్‌లో కొంతమంది క్రికెటర్లు ఆస్ట్రేలియాలకు పయనమయ్యారు. వీరిలో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు.. స్టార్ బ్యాట్స్‌మెన్లు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఉన్నారు. వీరితో పాటు టెస్ట్ వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, ఓపెఓపెనర్ యశస్వి జైస్వాల్, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ కూడా ఢిల్లీ విమానాశ్రయంలో కనిపించారు. కొంత మంది సహాయక సిబ్బంది కూడా వీరి వెంట ఉన్నారు. అయితే తొలి బ్యాచ్‌లో జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం వెళ్లడం లేదు. రెండో బ్యాచ్‌తో కలిసి సాయంత్రం ఆయన ఆస్ట్రేలియాకు పయనం కానున్నారు. ఇక ఆస్ట్రేలియాతో టీం ఇండియా మూడు వన్టేలు, ఐదు టి-20ల్లో తలపడనుంది. అక్టోబర్ 19 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం అవుతుండగా.. అక్టోబర్ 29 నుంచి టి-20 సిరీస్ ప్రారంభం అవుతుంది.