హైదరాబాద్: తెలుగులో తొలి నేపథ్య గాయని రావు బాల సరస్వతి (97) కన్నుమూశారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో తుది శాస్వ విడిచినట్లు కుటుంబసభ్యలు చెప్పారు. 1928లో జన్మించిన బాల సరస్వతి ఆరేళ్ల వయస్సు నుంచే సంగీతంపై మక్కువ పెంచుకున్నరు. ఆ పిన్న వయస్సు నుంచే ఆమె పాటలు పాడేవారు. ఆకాశవాఱి కార్యక్రమంతో తెలుగు వారికి బాల సరస్వతి పరిచయమయ్యారు ‘సతీ అనసూయ’ చిత్రంలో ఆమె తొలి పాటను పాడారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తో పాటు పలు భాషల్లో 2వేలకు పైగా పాటలు ఆలపించారు.