హైదరాబాద్: ప్రతిష్టాత్మక దేశవాళి క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీకి తెరలేచింది. ఇందులో భాగంగా నేడు గ్రూప్-ఎ, బి, సి, డిలోని వివిధ జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ టోర్నమెంట్‌లో హైదరాబాద్ తొలి మ్యాచ్‌లో ఢిల్లీతో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు టాస్ గెలిచింది. హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ బౌలింగ్ ఎంచుకొని.. ఢిల్లీ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఢిల్లీ జట్టుకు ఆయుష్ బదోనీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మరో మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఉత్తర్‌ప్రదేశ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో ఆంధ్ర కెప్టెన్ రికీ భుయ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌ని బౌలింగ్‌కి ఆహ్వానించాడు. యుపి జట్టుకు కరణ్ శర్మ కెప్టెన్సీ చేస్తున్నాడు.