మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతిష్ఠాత్మకమైన దేశవాళీ క్రికె ట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ సీజన్ 2025-26కి తెరలేవనుంది. బుధవారం ప్రారంభమ య్యే రంజీ ట్రోఫీకి వచ్చే ఏడా ది ఫిబ్రవరి 28తో తెరపడుతోం ది. రంజీ ట్రోఫీలో పాల్గొనే జట్ల ను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో 8 జట్లకు చోటు కల్పించారు. ఈ టోర్నీలో మొత్తం 32 జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్ టీమ్‌కు ఎలైట్ గ్రూప్‌డిలో స్థానం దక్కింది. ముంబై, ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, పుదుచేరి, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ జట్లు ఈ గ్రూప్‌లో ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ విదర్భతో పాటు ఆంధ్రా, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బరోడా, ఒడిశా, నాగాలాండ్, తమిళనాడు గ్రూప్‌ఎలో ఉన్నాయి.
కాగా, హైదరాబాద్ తన తొలి మ్యా చ్‌ను ఢిల్లీతో ఆడనుంది. హైదరాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా, హైదరాబాద్ టీమ్‌కు తిలక్‌వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. తన్మయ్ అగర్వాల్, చామ మిలింద్, కార్తీకేయ, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు తదితరులతో హైదరాబాద్ బలంగా కనిపిస్తోంది.
ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉంది. తిలక్‌వర్మ, తన్మయ్, త్యాగరాజన్, కార్తీకేయ, మిలిం ద్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉండడం హైదరాబాద్‌కు కలిసి వచ్చే అం శంగా చెప్పాలి. ఇక ఢిల్లీ టీమ్‌ను కూడా తక్కువ అంచన వేసే పరిస్థితి లేదు. కెప్టెన్ అయుష్ బడోని,అనూజ్ రావత్, నితీశ్ రాణా, ప్రియాన్ష్ ఆర్య, యశ్ ధుల్, నవ్‌దీప్ సైని, హిమ్మత్ సింగ్, సిమర్‌జీత్ సింగ్ తదితరులతో ఢిల్లీ పటిష్టంగా ఉంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.