మన తెలంగాణ/హైదరాబాద్ : రా ష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మంగళవారం సు ప్రీం కోర్టులో జస్టిస్ నాగరత్న, జస్టి స్ ఆర్ మహదేవ్ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ధర్మాసనం కీలక వ్యా ఖ్యలు చేసింది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కంప్యూటర్ క్లౌడ్, ఐ క్లౌడ్ పాస్‌వర్డ్ రీసెట్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే ప్రభాకర్ రావుకు అరెస్టు నుంచి క ల్పించిన స్పెషల్ రిలీఫ్‌ను న్యాయస్థా నం పొడిగించింది. తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది.
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌తో పాటు స్పెషల్ ప్రొటెక్షన్‌ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాననం ఈ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినించారు. మాజీ ఎస్‌ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కేసు దర్యాప్తునకు సహకరించడం లేదని, ఆయన్ను కస్టోడియల్ ఇంటరాగేషన్‌కు అప్పగించాలని కోర్టుకు తెలిపారు. కస్టోడియల్ ఇంటరాగేషన్ ద్వారానే నిజాలు బయటికి వస్తాయన్నారు. ప్రభుత్వం మారగానే హార్డ్ డిస్క్‌లో డేటా ధ్వంసం చేసి, కొత్తగా 50 హార్డ్ డిస్కులు ఆ స్థానంలో ఉంచారని న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, జడ్జిలు, బిల్డర్లు, వ్యాపారుల ఫోన్లు టాప్ చేశారని ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. నక్సలైట్ల పేరుతో ఈ కార్యక్రమాలన్నీ చేసినట్లు తెలిపారు. డిజిటల్ డివైసెస్‌లో డేటా ఫార్మా చేశారని, ఐ ఫోన్, ఐ క్లౌడ్ పాస్వర్డ్ ఇవ్వడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. డేటా మొత్తం డిలీట్ చేసి డివైసెస్ తమకు ఇచ్చారని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు తరఫున న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు.
ప్రభాకర్ రావు డివైస్ రీసెట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆయన్ను ఇప్పటికే 11సార్లు పిలిపించి సుమారు 80 గంటల పాటు విచారణ జరిపినట్లు తెలిపారు. డేటాను ప్రభాకర్ రావు డిలీట్ చేయలేదని డిపార్ట్‌మెంట్ డిలీట్ చేసిందని చెప్పారు. విచారణకు సహకరించడంలేదు అనడంలో వాస్తవం లేదని, విచారణ అంతా వీడియో రికార్డుల సమక్షంలోనే జరిగిందని కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం కేసులో సిట్ అధికారులు అడిగిన సమాచారం ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు ఇవ్వాల్సిందేనని తెలిపింది. అదే విధంగా యూజర్, పాస్‌వర్డ్‌ల సమాచారం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో సమాచారం తీసుకోవాలని సిట్‌కు సూచించింది. సమాచారం ధ్వంసం చేసినట్లుగా, నిందితుడు ప్రయత్నించనట్లుగా తేలితే తదుపరి చర్యలపై తాము నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 18 వతేదీకు వాయిదా వేసింది.