ఢాకా: బంగ్లాదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం రాజధాని ఢాకాలోని ఓ వస్త్ర కర్మాగారం, రసాయన గిడ్డంగిలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఢాకాలోని మీర్పూర్ ప్రాంతంలో ఓ వస్త్ర కర్మాగారం, రసాయన గిడ్డంగి ఉన్న రెండు భవనాల్లో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చి.. కర్మాగారంలోని మొదటి, రెండవ అంతస్తుల నుండి తొమ్మిది మృతదేహాలను వెలికితీశారు. విష వాయువు పీల్చడం వల్ల తొమ్మిది మంది మరణించి ఉంటారని అనుమానిస్తున్నట్లు అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసున నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.