స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ’తెలుసు కదా’ టీజర్, రెండు పాటలతో సంచలనాన్ని సృష్టించింది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. తమన్ సంగీతం అందించారు. మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ “నేను టిల్లు లాంటి క్యారెక్టర్ నుంచి బయటికి రావాలంటే ఇలాంటి సినిమాలు చేయాలి. ఈ సినిమాలో నాది ఇంటెలిజెంట్ క్యారెక్టర్. నేను చేసిన వరుణ్ క్యారెక్టర్ చాలా ఎంటర్‌టైనింగ్ గా ఉంటుంది. ఇది యూత్‌కి ఫ్యామిలీస్‌కి నచ్చే సినిమా”అని అన్నారు.
హీరోయిన్ రాశి ఖన్నా మాట్లాడుతూ “ఇది ఒక రాడికల్ సినిమా అవుతుంది. ట్రైలర్ చూసి చాలా సర్‌ప్రైజింగ్ గా అనిపించింది. ఈ సినిమా చూసిన తర్వాత టిల్లుని మరిచిపోతారు. అంత నమ్మకం ఉంది”అని తెలిపారు. హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ “ట్రైలర్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. సినిమా విడుదల కోసం నేను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను”అని తెలియజేశారు. డైరెక్టర్ నీరజ కోన మాట్లాడుతూ “ఇది నా ఫస్ట్ ఫిలిం. చాలా స్పెషల్. ట్రైలర్‌లో చూసిన దానికి పది రెట్లు సినిమాలో ఉంది”అని పేర్కొన్నారు. ప్రొడ్యూసర్ కృతి ప్రసాద్ మాట్లాడుతూ “ఈ కథ వినగానే నచ్చింది. యూత్ ఆడియన్స్ సినిమాకు కనెక్ట్ అవుతారు. బిగ్ స్క్రీన్ మీద సినిమా చూపించడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము”అని అన్నారు. ఈ కార్యక్రమంలో మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, వైవా హర్షత దితరులు పాల్గొన్నారు.