మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్‌రెడ్డికి నేడు ఉదయం 9 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. బిసి రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌లపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ అంశాన్ని సవాల్ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా సీనియర్ లాయర్‌లతో సిఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో భేటీ కానున్నారు. కోర్టులో వాదించాల్సిన అంశాల గురించి వారితో సిఎం రేవంత్‌రెడ్డి చర్చించనున్నట్టుగా తెలిసింది.