హైదరాబాద్: కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అనిల్ కుమార్ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల రుసుం పెట్టారని పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. లాటరీలో షాపు దక్కకపోతే రూ.3 లక్షలు ఆబ్కారీ శాఖకే వెళ్తాయని పిటిషనర్ పేర్కొన్నారు. షాపు దక్కకుంటే డబ్బు తిరిగి వచ్చేలా ఆబ్కారీ శాఖను ఆదేశించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. లిక్కర్ పాలసీపై జారీ చేసిన జివొ 93ను కొట్టివేయాలని పిటిషనర్ కోరారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.