జెరూసలెం : గాజా ఒప్పందం కుదిర్చి, బందీల విడుదలకు కృషి చేసినందుకు గాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు అరుదైన గౌరవాన్ని అందించనున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ ‘ మెడల్ ఆఫ్ ఆనర్ ’ ను అమెరికా అధ్యక్షుడికి ప్రదానం చేయనున్నట్టు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇస్సాక్ హెర్జోగ్ వెల్లడించారు. రానున్న నెలల్లో సమయం, వేదిక నిర్ణయించి అందజేయనున్నట్టు తెలిపారు. బందీల విడుదల చరిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని సాధించడంలో చేసిన కృషికి గాను ఈ గౌరవాన్ని అందుకోడానికి ట్రంప్ అర్హుడని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్ లోనే కాకుండా మధ్య ప్రాచ్యంలో శాంతియుత భవిష్యత్తును నెలకొల్పడానికి ట్రంప్ పునాది వేశారని కొనియాడారు.