సోషల్‌మీడియా అందుబాటులోకి రాని సమయంలో ఎంత పెద్ద సినిమాలో అయినా చిన్నచిన్న పొరపాట్లు జరిగితే ఎవరూ పట్టించుకునే వారు కాదు. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ప్రేక్షకులు సినిమాలో ఏదైన తప్పు దొరికితే వెంటనే దాన్ని నెట్‌లో పెట్టి ఏకి పారేస్తున్నారు. తాజాగా ‘కాంతార: ఛాప్టర్ 1’ సినిమాకు ఇదే పరిస్థితి ఎదురైంది. అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కలెక్షన్ల పరంగా కూడా కాసుల పంట పండిస్తోంది.
‘కాంతార’ ప్రస్తుతం జరుగుతున్నట్లు తీశారు. కానీ, ఈ సినిమా దానికి ప్రీక్వెల్‌గా 16వ శతాబ్ధంలో జరుగుతున్నట్లు తెరకెక్కించారు. అందుకు తగినట్లు సెట్స్, కాస్ట్యూమ్స్ అన్ని చక్కగా డిజైన్ చేశారు. కాని ఒక్కచోట మాత్రం టీమ్ తప్పు చేసింది. తాజాగా ఈ సినిమాలో సెకండాఫ్‌లో ‘బ్రహ్మకలశ’ అనే పాట ఉంటుంది. గూడెంలో ఉండే దేవుడిని రాజు ఉండే చోటుకి తీసుకువచ్చే సందర్భంలో ఈ సాంగ్ వస్తుంది. ఈ పాటలో అందరూ కలిసి భోజనం చేస్తున్న చోట ప్రస్తుతం వాడుకలో ఉన్న 20 లీటర్ల వాటర్ క్యాన్ కనిపిస్తుంది. ఇది సినిమాలో, రెండు రోజుల క్రితం విడుదల చేసిన వీడియో సాంగ్‌లోనూ కనిపించింది. దీనిపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. 16వ శతాబ్ధంలో వాటర్ క్యాన్ ఎలా వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు.