న్యూఢిల్లీ: భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఎట్టకేలకు ఐదో రోజు వరకూ వెళ్లింది. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ జట్టు వీరోచితంగా పోరాడింది. ముఖ్యంగా చివరి వికెట్‌ని గ్రీవ్స్, సీల్స్ ఇద్దరు కాపాడుకుంటూ.. పరుగులు సాధించారు. దీంతో వెస్టిండీస్ 390 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో భారత్ ముందు 121 పరుగుల విజయలక్ష్యాన్ని ముందుంచింది. అయితే లక్ష్య చేధనలో భారత్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. 9 పరుగుల వద్దే యశస్వీ జైస్వాల్ (8) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన సాయి సుదర్శన్‌తో మరో ఓపెనర్ రాహుల్ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ వచ్చారు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 1 వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. క్రీజ్‌లో రాహుల్ (25), సుదర్శన్ (30) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే భారత్ ఇంకా 58 పరుగులు చేయాలి.