చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(84) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో హైదర్ గూడలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆయన మృతిపట్ల బిఆర్ఎస్ ఎంఎల్ఎలు సబితా ఇంద్రారెడ్డి, కాలే యాదయ్య, రాజకీయ నాయకులు, స్థానికులు సంతాపం తెలిపారు. 1983లో కొండా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున చేవెళ్ల నియోజకవర్గం నుంచి గెలుపొందారు.