సైదాబాద్: హైదరాబాద్ రాజధాని సైదాబాద్ బాలసదన్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. హోమ్ లో ఉన్న బాలుడుపై స్టాప్ గార్డ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనుమతి లేకుండా బాలుడిని స్టాఫ్ గార్డ్ ఇంటికి పంపించాడు. ఇంటికి వెళ్లిన తర్వాత బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రిలో చెక్ చేయించగా బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు గుర్తించారు. తల్లిదండ్రులు బాల సదన్ కి ఫిర్యాదు చేశారు. బాలసదన్ ఫిర్యాదుతో స్టాఫ్ గార్డ్ ను పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురిపై కూడా స్టాప్ గార్డు లైంగిక దాడికి పాల్పడ్డట్టు గుర్తించారు. బాల సదన్ లోని పిల్లలకి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.