బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం క్రిష్ణగిరి జిల్లా హోసూర్ దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెరెండపల్లి సమీపంలో కారును పలు వాహనాలు ఢీకొట్టడంతో నలుగురు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎరోడ్‌కు చెందిన మదన్ కుమార్ అనే వ్యక్తి ఐదు నెలల క్రితం ఓ యువతి పెళ్లిచేసుకున్నాడు. ప్రస్తుతం అతడు కెనడాలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. దీపావళి పండుగ సందర్భంగా శనివారం సొంతూరుకు కెనడా నుంచి వస్తున్నాడు. బెంగళూరు విమానాశ్రయంలో అతడిని తీసుకరావడానికి ముగ్గురు స్నేహితులు వెళ్లారు. కారులో సొంతూరుకు వస్తుండగా బెరండపల్లి సమీపంలో గుర్తు తెలియని కంటైనర్ వాహనాలు కారును ఢీకొట్టాయి. దీంతో కారులో ఉన్న నలుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు టి. మదన్ అలియాస్ మదన్ కుమార్ (28), సేలం జిల్లా కన్నకురిచికి చెందిన కె. గోకుల్ (28), సేలం జిల్లా పచ్చగౌండనూరు చెందిన ఎం. ముకిలన్ (30), సేలం జిల్లా పన్నపట్టి చెందిన పి. మనివన్నన్ (27) గుర్తించారు.