ఝాన్సీ పబ్లికేషన్స్ శ్రీ దివ్యతో విమల సంభాషణ*
పుస్తక ప్రచురణ రంగంలోకి మీరు ఎలా వచ్చా రు? అందుకు ప్రేరణ ఏమిటి? ఎంత కాలంగా పుస్తకాలు ప్రచురిస్తున్నారు?
మా స్నేహితుల్లో ఒకరు ఒక పుస్తకం తీసుకురావా లి అనుకున్నప్పుడు పుస్తక ప్రచురణ ఆలోచన మొదలైంది. చిన్నప్పటినుంచీ చదివిన పుస్తకాలే మాకు ప్రేరణగా నిలిచాయి. 2023లో మా మొదటి పుస్తకం ‘పూరీ ద పవర్ హౌస్’ తీసుకురావడంతో మొదలయింది ఝాన్సీ ప్రయాణం. ఆ ఒక్క పుస్తకంతో మొదలైన రోజు కూడా, మేము ఇలా వరుసగా పుస్తకాలు వేస్తామని అనుకోలేదు. ఆ పుస్తకం ఇచ్చిన నమ్మ కం మా పనిపైన మరింత నమ్మకాన్ని పెంచింది.
మహిళా ప్రచురణకర్తలు చాలా తక్కువ ఈ రంగంలో. ప్రధానంగా సాహిత్యం, ప్రచురణలు, సాహిత్య అకాడమీలు ఇటువంటివన్నీ మన సమాజంలో ఇంకా పురుష ప్రధాన రంగాలే. ఇలాంటి వాతావణంలో ఒక మహిళగా ఈ రంగాన్ని ఎంచుకొని, పనిచే స్తున్న క్రమంలో, మీరు ఎదుర్కొన్న ప్రత్యేకమైన ఇబ్బందులేమైనా ఉన్నాయా? ఉంటే పంచుకో గలరా?
ఎక్కడైనా ఉండేటువంటి ఇబ్బందులే ఇక్కడా ఉన్నా యి. ఏదైనా పని గురించి మాట్లాడేటప్పుడు మొద ట్లో మగవారు ఎవరున్నారు సమాధానమివ్వడానికి అన్నట్టు చూసేవారు కొందరు రచయితలు. అది కాస్త ఇబ్బందిగా అనిపించినా కొద్దిసేపే. కానీ ఈ రంగలో అమ్మాయిలు రావాలి అంటూ ఉత్సాహ పరిచే వారు కూడా ఉన్నారు.
సాహిత్య ప్రచురణలో మీకై మీరు నిర్దేశించుకున్న ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా? ఎలాంటి పుస్త కాలు వేయడానికి, లేదా వేయకపోవడానికి మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు?
సాహిత్య విలువలున్న పుస్తకాలు అన్ని ప్రక్రియల్లోనూ తీసుకురావాలి అనుకుంటున్నాం. ముఖ్యం గా కొత్త రచయితలకి అం దుబాటులో ఉంటూ, కొత్త రచనలు ప్రోత్సహించే ఒక మంచి వేదిక గా ఉండాలి అనే ఉద్దే శ్యం మాది. కొత్త, పాత రీ డర్లకు పఠనానుభవం ఇవ్వాలన్న ప్రాధాన్యత మాకు ము ఖ్యం. అయితే, ఇప్పటివర కూ కవిత్వం తేలేకపోయాం ముందు ముందు కవిత్వం, ట్రావెలాగ్స్ మీద కూడా దృష్టి పెట్టాలని అనుకుంటున్నాం.
సాహిత్యాకి విలువల్ని, ప్ర మాణాల్ని, బాధ్యతలను ఆపాదించడం తప్పనే ధోరణి ఒకటి ఉంది. అమ్ముకోగలిగితే, రచయిత ఏది రాసినా, భాష, భావం ఎలా ఉన్నా ప్రచురణకి అర్హమైనదే అనే వాదనలు కూడా ఉన్నాయి. అలాంటి పుస్తకాలు మీ వద్దకు ప్రచురణ కోసం వచ్చినప్పుడు, ప్రచుర ణ కర్తలుగా మీరు ఎలాంటి వైఖరి సాధారణంగా తీసుకుంటారు?
పాఠకులను దృష్టిలో ఉంచుకుని మంచి కథ చెప్పాలనే బాధ్యత ఉండాలి అనుకుంటా ము. ఒక్కో పుస్తకానికి ఒక్కో ఉద్దే శ్యం ఉంటుంది. అది యాస అ వ్వొచ్చు, కథా వస్తువు అవ్వొచ్చు, కథ చెప్పే తీరు అవ్వొచ్చు. వీటిలో ఆసక్తిగా అనిపించి వాటిని తీసుకు ని పుస్తకంగా తీసుకొస్తాము. అమ్ముకోగలిగితే ఏది, ఎలా రాసినా ప్రచురణకి అర్హమైనదే అనుకోవటం పట్ల మాది భిన్నాభిప్రాయమే. అయితే మా వరకూ స్త్రీల విషయంలో, మూఢనమ్మకాలూ, అసంబద్ధమైన ఆలోచనలు ఉండే, లేదా సమర్థించే సాహిత్యానికి ప్రాధాన్యత ఇవ్వకూడదనే అనుకుంటాము. సమాజాన్ని ఓ అడుగు ముందుకు వేయించే రచనలు, సాహిత్యపరంగా సంతృప్తినిచ్చే రచనలే మా మొదటి ప్రయారిటీ.
పబ్లికేషన్ రంగంలో నూతన మార్పులు గత కొన్నేళ్ళుగా చోటు చేసుకుంటున్నా యి. ఒక ప్రచురణా సంస్థ అంతిమం గా ఒక సంస్థగా నిలబడాలి అని అంటే ‘లాభంపెట్టుబడిలాభం’ సూత్రం పాటించక తప్పదు అంటారు. మార్కెటింగ్, బిజినెస్ పోటీని తట్టుకుని ముందుకు సాగేందుకు ఎలాంటి పద్ధ తులను, మాధ్యమాలను మీరు ఎంచు కున్నారు?
ఏ వ్యాపారం నిలబడాలన్న కొన్ని సూత్రాలు పా టించాలి. ఝాన్సీ పబ్లికేషన్స్ వీలైనంత ఎక్కువమం ది పాఠకులకు కనపడేలా ప్రణాళిక వేసుకుంటాం. వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో మా పుస్తకాలు అందుబాటులో ఉండేలా చూస్తాం. రకరకాల సభలు, పుస్తక వేడుకల్లో పాల్గొంటాం. అన్నిటికన్నా ముఖ్యంగా పాఠకులనుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ లకు, కచ్చితంగా మా రిప్లై అందేలా చూసుకుంటాం. సలహాలూ, సూచనలూ ఇచ్చే పాఠకులు చాలా అవసరం అనుకుంటాం.
తన జీవిక రచనల ద్వారా నే అని, తాను పూర్తి సమయం రచయితనని చెప్పుకునే పరిస్థితి మన దేశంలో మరీ ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో దా దాపు లేదనే చెప్పవచ్చు. రచయితలకి తమ రచన పై కాపీరైట్ ఉండడం, రచనకి రెమ్యునరేషన్, పు స్తకాల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంలో వాళ్లకి కూడా భాగం ఇవ్వడం లాంటి విషయాలపై ఝాన్సీ పబ్లికేషన్ ఏమ నుకుంటున్నది?
ఏ ప్రచురణ సంస్థలైనా నిలబడేది రచయితల వల్ల నే. అటువంటి రచయితలకి తప్పకుండా వారి పారితోషకం అందజేయాలి. మా బాధ్యతగా ఝాన్సీతో అసోసియేట్ అయి ఉన్న ప్రతి రచయితకీ పారితోషకం అందుతుంది. ఇప్పటి వరకూ మేము ప్రచురించిన ఏ పుస్తకం విషయంలోనైనా రచయితకి అందాల్సిన పారితోషికం విషయంలో పూర్తి పారదర్శకంగా ఉన్నాము. కొత్త రచయితా, సీనియర్ రైటరా అనే తేడా లేకుండా అందరికీ ముందు అనుకున్న ప్రకారమే చెల్లిస్తూ వస్తున్నాము. పుస్తకాల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంలో వాళ్లకి కూడా భాగం ఇవ్వడం.. కేవలం వ్యాపార సంబంధం కాదు, అది మా బాధ్యత కూడా అనుకుంటాము.
తక్కువ కాలంలోనే మీరు చాలా వేగంగా, పుస్తకా లు ప్రచురిస్తున్నారు. భవిష్యత్ ప్రణాళికలేంటో మెహఫిల్ పాఠకులతో పంచుకుంటారా?
మా చుట్టూ ఉన్నవాళ్లు కాకుండా సగటు పాఠకుడే మాకు ముఖ్యం. వాళ్ళని దృష్టిలో ఉంచుకునే వీలైనన్ని ఎక్కువ మంచి పుస్తకాలను తీసుకువస్తున్నాం. ఈ సంవత్సరం మా నుండి మూడు పుస్తకాలు వచ్చాయి. ఇంకో పది పుస్తకాల వరకూ ఈ నవంబర్ కల్లా రాబోతున్నాయి. అయితే ఏ పుస్తకమైనా దాన్ని కొన్న పాఠకుడికి సంతృప్తినివ్వాలి. అదే సమయంలో కేవలం టైంపాస్ పుస్తకంగా మిగిలి పోకూడదు. భవిష్యత్‌లో వీలైనంత మంది కొత్త రచయితలని కూడా పరిచయం చేయాలనుకుంటు న్నాం. అది కూడా రకరకాల మాండలీకాలలో వచ్చే రచనలని, గ్రామీణ ప్రాంత యాస, భాషలని డాక్యుమెంట్ చేసేవి, కొత్త విషయాలని చెప్పే ట్రావెలాగ్స్ లాంటివి కూడా ప్రచురించాలనే ప్రయత్నాల్లో ఉన్నాం.
– శ్రీదివ్య ఝాన్సీ పబ్లిషర్స్