మన తెలంగాణ/హైదరాబాద్‌ః జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్‌ను మూవీ ఆర్ట్ అసోసియేషన్ (మా) నుంచి తొలగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ‘మా’ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆదివారం బల్మూరి వెంకట్ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
శ్రీకాంత్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు. రెండు రోజుల్లో అసోసియేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చిస్తామని మంచు విష్ణు తనకు హామీ ఇచ్చారని బల్మూరి వెంకట్ తెలిపారు. ఈ అంశంపై సినీ పరిశ్రమ పెద్దలు కూడా స్పందించాలని ఆయన కోరారు.