విశాఖ: ఐసిసి మహిళ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా విశాఖలోని ఎసిఐ-విడిసిఎ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో టీం ఇండియా తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధన, ప్రతీక రావల్‌లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 155 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇరువురు ఓపెనర్లు హాఫ్ సెంచరీలు సాధించారు. అంతేకాక.. స్మృతి ఈ మ్యాచ్‌లో వన్డేల్లో ఐదు వేల పరుగుల మైలురాయిని కూడా చేరుకుంది. అంతేకాక.. ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి మహిళ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది. అయితే సోఫీ మోలినెక్స్ వేసిన 24వ ఓవర్ మూడో బంతికి స్మృతి (80) క్యాచ్ ఔట్ రూపంలో వెనుదిరిగింది. దీంతో 29 ఓవర్లు ముగిసేసరికి భారత్ 1 వికెట్ నష్టానికి 183 పరుగులు చేసింది. క్రీజ్‌లో ప్రతీక (73), హర్లిన్ (14) ఉన్నారు.