ప్రస్తుతం జరుగుతున్న వెస్టిండిస్ సిరీస్‌లో భారత్‌కు కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్ వ్యవహరిస్తుండగా.. వైస్ కెప్టెన్‌గా సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజాకు బాధ్యతలు అప్పగించారు. వికెట్ కీపర్, బ్యాట్స్.మెన్ రిషబ్ పంత్‌కి గాయం కావడంతో జడేజాకు ఈ అవకాశం వచ్చింది. రండో వన్డే మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా.. బౌలింగ్‌లో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడు కీలకమైన వికెట్లు తీశాడు. మరోవైపు రిటైర్‌మెంట్‌కి ముందు టిం ఇండియాకు కెప్టెన్సీ (టెస్టుల్లో) చేసే అవకాశం ఉందా? అని మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జడేజాను ప్రశ్నించారు.
అయితే ఈ ప్రశ్నకు గతంలోనే సమాధానం చెప్పానని జడేజా అన్నాడు. ‘‘గతంలోనే ఈ ప్రశ్నపై నేను స్పందించాడు. ఇప్పుడు పైస్ కెప్టెన్ కావడంతో అడుగుతున్నారు. కానీ, నాకు మాత్రం ఎలాంటి ఆలోచనే లేదు. గతంలో ఉండేది. అయితే ఇప్పుడు సమయం దాటిపోయింది. నా దృష్టంగతా మారింత కాలం జట్టుకు ప్రాతినిథ్యం వహించడంపైనే. విండీస్ సిరీస్‌లోనూ పిచ్‌ను బట్టే బౌలింగ్‌లో మార్పులు చేసుకున్నా. బ్యాటింగ్, బౌలింగ్‌తో జట్టుకు ప్రయోజనం కలిగిస్తే చాలని అనుకుంటున్నా.. అంతేకానీ, కెప్టెన్సీ లేదా వైస్ కెప్టెన్సీ గురించి ఆలోచన లేదు’’ అని జడేజా తెలిపాడు.