హైదరాబాద్: రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలుకా’. అయితే గత ఏడాది విడుదలైన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాతో డిజాస్టర్‌ని మూటగట్టుకున్నాడు రామ్. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ సినిమాతో తిరిగి ఫామ్‌లోకి రావాలని భావిస్తున్నాడు. ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఉపేంద్ర ఈ సినిమాలో ఉపేంద్ర స్టార్ హీరోగా నటిస్తుండగా.. అతని అభిమానిగా రామ్ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
తన అభిమాన హీరో కోసం ఎంత దూరమైన వెళ్లే ఫ్యాన్‌గా రామ్ ఈ టీజర్‌లో కనిపించాడు. హీరో కోసం ఫైట్లు చేయడం.. థియేటర్ వద్ద గోల చేయడం మనం ఈ టీజర్‌లో చూడొచ్చు. ఇక హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సేతో లవ్ సీన్స్ కూడా ఆకట్టుకొనేలా ఉన్నాయి. చివర్లో ‘‘ఫ్యాన్.. ఫ్యాన్.. అని నువ్వు గుడ్డలు చించుకోవడమే కానీ.. నువ్వు ఒకడివి ఉన్నావని కూడా మీ హీరోకు తెలియదు.. ఏం బతుకులురా మీవీ.. చీచీ’’ అనే చెప్పే డైలాగ్‌తో టీజర్ ముగుస్తుంది. మొత్తానికి టీజర్ ఎనర్జిటిక్‌గా ఉంది. ఈ సినిమాతో రామ్ సూపర్హిట్ అంుకోవానలి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు మహేశ్‌బాబు పి దర్శకత్వం వహించగా.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై చిత్రాన్ని నిర్మించారు. మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, విటివి గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 28వ తేదీన ఈ సినిమా థియేటర్‌లో సందడి చేయనుంది.