న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అద్భుత ప్రదర్శన చేశాడు. అదిరిపోయే ఫామ్‌లో ఉన్న అతడు సెంచరీ సాధించి తన సత్తా నిరూపించుకున్నాడు. అయితే దాన్ని డబుల్ సెంచరీగా మార్చడంలో మాత్రం విఫలమయ్యాడు. 175 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. రెండో రోజు ఆట అనంతరం అతడు మాట్లాడుతూ.. రనౌట్ కావడంలో ఆటలో భాగమే అని.. అందుకు తనకు ఎలాంటి బాధ లేదని పేర్కొన్నాడు. ఈ క్రమంలో జైస్వాల్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా జైస్వాల్‌ని తనదైన శైలీలో కొనియాడారు.
సాధారణంగా టెస్టుల్లో సెంచరీ చేస్తే.. దాన్ని డాడీ హండ్రెడ్స్ అని అంటారు. అయితే జైస్వాల్ చేసిన సెంచరీ తనకు గ్రాండ్‌డాడీ హండ్రెడ్స్డ్‌తో సమానమని అన్నారు. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత జైస్వాల్‌తో గవాస్కర్ చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా హర్ష భోగ్లే మాట్లాడుతూ ‘‘అద్భుతంగా ఆడావు. నీ బ్యాటింగ్‌ను మేమంతా ఆస్వాదించాం. ఇన్నింగ్స్ ఎలా ముగిసిందనేది పట్టించుకోవద్దు. నీ ఆటను చూడటం చాలా బాగుంది’’ అని అన్నాడు. అనంతరం గవాస్కర్ స్పందిస్తూ.. ‘‘హర్షా చెప్పిన మాటలకు నేను మరికొంత సమాచారం యాడ్ చేస్తున్నాడు. ఇలాగే ముందుకు సాగాలి. సెంచరీలు చేస్తూనే ఉండు. డాడీ హండ్రెడ్స్‌తో ఆగిపోవద్దు. వాటిని భారీ ఇన్నింగ్స్‌లుగా మార్చు. ఇప్పుడు నేను గ్రాండ్‌ఫాదర్‌ను. కాబట్టి నువ్వు చేసిన వాటిని గ్రాండ్‌డాడీ హండ్రెడ్స్‌గా భావిస్తా’’ అని పేర్కొన్నారు. దీనికి జైస్వాల్ స్పందిస్తూ ‘థాంక్యూ సర్’ అని అన్నాడు.