హైదరాబాద్: పబ్లిసిటీ కోసమే శ్రీకాంత్ అయ్యంగార్ చరిత్రను వక్రీకరించారని ఎమ్మెల్సి బల్మూరి వెంకట్ తెలిపారు. శ్రీకాంత్ అయ్యంగార్ ‘మా’ సభ్యత్వం రద్దు చేయాలని బల్మూరి వెంకట్ కోరారు. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బల్మూరి మీడియాతో మాట్లాడుతూ… మన జాతి పిత మహాత్మ గాంధీజీపై అనుచిత వ్యాఖ్యలపై చేసిన శ్రీకాంత్ అయ్యంగార్ పై చర్యలకు విజ్ఞప్తి చేశారు. సినీ పెద్దలు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించాలని సూచించారు. ‘మా’ నిర్ణయాన్ని త్వరగా తెలియజేయాలని కోరుతున్నామని బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు.