ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ మూడో రోజు విండీస్ జట్టు 81.5 ఓవర్లలో 248 పరుగులు చేసి ఆలౌటైంది. ప్రస్తుతం భారత జట్టు 270 పరుగుల ఆధిక్యంలో ఉంది. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలంలో పడి విండీస్ విలవిలలాడిపోయింది. విండీస్ బ్యాట్స్‌మెన్లలో ఒక్కరూ కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. విండీస్ బ్యాట్స్‌మెన్లలో అలిక్ అతాంజే(41), చంద్రపాల్(34), సాయి హోప్(36), అండర్సన్ ఫిలీప్(24) నాటౌట్, ఖరీ పీరీ(23), టెవిన్ ఇమ్లాచ్(21), జస్టిన్ గ్రీవ్స్(18), జయదీన్ సీల్స్(13) క్యాంప్ బెల్(10) పరుగులు చేయగా మిగిలిన బ్యాట్స్‌మెన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. చివరలో టెయిలెండర్లు ఆదుకోవడంతో విండీస్ గౌరవ ప్రదమైన పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు, రవీంద్ర జడేజా మూడు, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ చెరో ఒక వికెట్ తీశారు. ఇప్పటికే ఈ సిరీస్‌లో భారత్ తొలి టెస్టు గెలిచి ముందంజలో ఉంది.