కొల్చారం: మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శనివారం అత్యాచారానికి గురైన మహిళ మృతి చెందింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. కొల్చారంలో మహిళను పని ఇప్పిస్తామని చెప్పి శివారులోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బండరాయికి కట్టేసి అక్కడి నుంచి దుండగులు పారిపోయారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి తరలిస్తుండగా ఆమె చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న సిసి కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.