కర్నూలు: ప్రతి ఏడాది విజయనగరం పట్టణంలో వినూత్నంగా జరిగే ప్రముఖ జాతరగా పేరొందింది. ఇది పైడితల్లి అమ్మవారి జాతరగా ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతో విశిష్టమైన ఆధ్యాత్మిక ఉత్సవం. సిరిమాను ఉత్సవం సాధారణంగా దసరా పండుగ అనంతరం వచ్చే మొదటి మంగళవారం రోజు నిర్వహిస్తారు. 2025 సంవత్సరానికి అక్టోబర్ 7న ఈ ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవానికి ముందుగా సెప్టెంబర్ 12 నుంచి వివిధ పూజా కార్యక్రమాలు, మండల దీక్షలు జరుగుతాయి. అక్టోబర్ 14న తెప్పోత్సవం, అక్టోబర్ 22న ఉయ్యాల కంబోత్సవంతో జాతర ముగుస్తుంది.
ఉత్సవ విధానము:
సుమారు 60 అడుగుల పొడవైన “సిరిమాను” అనే భారీ గడ్డిని చెక్కి, చివరలో ప్రత్యేక పీఠం అమర్చుతారు. ఆ పీఠంపై ఆలయ ప్రధాన పూజారి కూర్చుంటారు. సిరిమాను వాహనం విజయనగరంలోని మూడు లాంతర్ల జంక్షన్ నుంచి కోట వరకు మూడుసార్లు ఊరేగింపుగా తీసుకువెళతారు. ఈ ఊరేగింపులో బెస్తవారి వల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం ముఖ్య ఆకర్షణగా నిలిచాయి. సిరిమాను ముగిసిన తరువాత దాన్ని అంత చిన్న ముక్కలుగా చేసి భక్తులకు ప్రసాదంగా పంచుతారు. భక్తులు ఆ ముక్కలను ఇంట్లో లేదా పొలాల్లో ఉంచితే సిరి, ధనధాన్యాలు, వ్యవసాయము సమృద్ధిగా ఉంటుందని నమ్మకం కలుగుతుంది. ఈ మహోత్సవాన్ని చూసేందుకు లక్షలాది భక్తులు ఉత్తరాంధ్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తరలివస్తారు.
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్
గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు