న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మో డీ శనివారం రెండు భారీ వ్యవసాయ రంగ పథకాలను ప్రా రంభించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి న ఈ రెండు స్కీంలకు కలిపి మొత్తం రూ 35,440 కోట్ల కే టాయింపులను ఖరారు చేశారు. ఈ పథకాలను ప్రారంభించిన దశలో ఆయన కాం గ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలకు దిగారు. కాంగ్రెస్ సుదీర్ఘ పాలనాకాలంలో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్లక్షానికి గురైందని, దీనితోనే మనం అత్యంత కీలకమైన పప్పు దినుసుల కోసం ఇతరదేశాలపై ఆధారపడి ఉండటం బాధాకరం అన్నారు. ఇప్పుడు ప్రవేశపెట్టిన రెండు పథకాలలో ఒక్కటి దేశంలో అత్యధిక నిత్యావసర ఆహార సరుకు అయిన పప్పు ధాన్యాలకు సంబంధించింది. దేశంలో ప ప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సంబంధిత ప్రచారోద్యమం కూడా ఈ స్కీంలో భాగంగా ఉంటుంది. గ్లోబల్ డిమాండ్‌ను తట్టుకుంటూ దే శం పప్పుల దిగుమతిపై ఆధారపడటం తగ్గించుకునే దిశలో స్కీంలు
రూపొందించారు. దేశ రాజధాని ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం (ఐఎఆర్‌ఐ) పుసా క్యాంపస్‌లో సోషలిస్టు సంస్కర్త జయప్రకాశ్ నారాయణ్, నానాజీ దేశ్‌ముఖ్‌ల జయంతి సభల నేపథ్యంలోనే ఈ స్కీంలను ప్రారంభించారు. ప్రధాని మోడీ ఈ రోజు ప్రారంభించిన స్కీంలలో ఒకటి రూ 24000 కోట్లతో కూడిన ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన( (పిఎండిడికెవై), మరోటి రూ 11,440 కోట్ల కేటాయింపుల మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ (పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి) , ఈ రెండు పథకాలతో దేశంలో సంబంధిత లక్షలాది మంది రైతుల భవితలో గణనీయ మార్పులు వస్తాయని ప్రధాని తెలిపారు. ఇప్పటికే ఈ రెండు పథకాలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపి ఉంది. వీటిని రాబోయే రబీ సీజన్ నుంచి 203031 పంట కాలం వరకూ అమలులో పెడుతారు.
అనుబంధ రంగాల స్కీంలు 5450 కోట్ల మేర
పంటల పథకాలతో పాటు ప్రధాని మోడీ వ్యవసాయ అనుబంధ రంగాలకే సంబంధించి రూ 5450 కోట్లతో కూడిన మరికొన్ని పథకాలకు కూడా శ్రీకారం చుట్టారు. ఇందులో పాడిపరిశ్రమలు, చేపల పెంపకం, ఆహార శుద్ధి రంగాలకు సంబంధించిన స్కీంలు ఉంటాయి. ఇక రూ 815 కోట్ల విలువైన పనులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవం జరిపారు. ఈ నేపథ్యంలో ఆయన భారతీయ కర్షక సోదరుల మొక్కవోని దీక్షను కొనియాడారు. స్వాతంత్య్రానంతరం దేశంలో మనం ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధి సాధించగలిగాం. ఇక వికసిత్ భారత్ లక్షం సాధనలో రైతాంగం పాత్ర కీలకం కానుంది.
2030 రాటికి భారత్ వికసిత భారత్ కావాలనే ఆలోచనలతో సాగుతున్నాం. మనం ఓ వైపు దేశంలో ఆహార ధాన్యాల అవసరాలకు తగ్గ ఉత్పత్తిని సాధించడమే కాకుండా , గ్లోబల్ మార్కెట్‌కు కూడా డిమాండ్ మేరకు ఎగుమతి చేసే పరిస్థితిని తెచ్చుకోవల్సి ఉంటుంది. మనం ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ తలుపులను ఆత్మవిశ్వాసంతో తట్టాల్సి ఉంటుందని పిలుపు నిచ్చారు. రైతు సోదరులకు ఇది తన సందేశం కాదని , విన్నపం అన్నారు. వ్యవసాయం అనేది సశాస్త్రీయం అవుతుంది. కేవలం సాధారణ పంటలను వేయడమే కాకుండా , వైవిధ్య పంటల సాగుబడికి రైతులు నడుం బిగించాల్సి ఉంటుందన్నారు. కేవలం గోధుమలు, వరి కాకుండా ఇతరత్రా పంటలపై కూడా ప్రత్యేకించి వాణిజ్య పంటలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మన దేశ వ్యవసాయ పరిశోధనా రంగ నిపుణులు ఎప్పటికప్పుడు అందించే సూచనలు సలహాలను పాటించాలని కోరారు.
2030 నాటికి 35 లక్షల హెక్టార్లలో పప్పు పంటలు
ఇప్పుడు చేపట్టిన పప్పు ధాన్యాల పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలో పప్పు దాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని సంకల్పించింది. 2030 నాటికి 35 లక్షల హెక్టార్లలో పప్పు ధాన్యాల పంటల సాగుబడిని లక్షంగా పెట్టుకున్నారని ప్రధాని మోడీ తెలిపారు. ఇప్పుడు ప్రతి హెక్టారుకు ఉన్న 250లక్షల టన్నుల దిగుబడిని 350 లక్షల టన్నుల స్థాయికి తీసుకువెళ్లాలనేదే నిర్ణీత లక్షం అన్నారు. జిల్లాల వారిగా ఇందుకు సరైన క్షేత్ర స్థాయి ప్రచారం చేపడుతారు.దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో పప్పు ధాన్యాల సాగులో ఉన్న కొందరు రైతులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొద్ది సేపు ముచ్చటించారు. వారి సాధకబాధకాలను తెలుసుకున్నారు. ఇక్కడ జరిగిన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మత్స, పాడిపరిశ్రమ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఇతర మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తలోదిక్కుతో తల్లడిల్లిన వ్యవసాయ రంగం
కాంగ్రెస్ హయాంలో పలు విభాగాల పనితీరులో సరైన సమన్వయం లేదు. దీనితో రైతాంగ సమగ్ర సాగు వాతావరణం దెబ్బతింది. ఎటువంటి సమన్వయం లేకుండా అనుబంధ రంగాలు యాంత్రికంగా పనిచేయడంతో రైతులకు అన్యాయం జరిగిందని ప్రధాని మోడీ విమర్శించారు. తలోదిక్కు లాగితే ఎటువంటి తలకిందుల పరిస్థితి ఏర్పడుతుందనే దానికి కాంగ్రెస్ పాలన తార్కాణం అన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి మారిన కాంగ్రెస్‌కు ఇప్పటికీ వ్యవసాయ రంగంపై , రైతులపై ఎటువంటి సదభిప్రాయం లేదు. సరైన దృక్పథం లేదని ఆరోపించారు. సాగుపై విజన్‌లేని పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. ఏదో సాగుతుందిలే అనే రీతిలో నెలకొన్న సాగు విధానాలతో కాంగ్రెస్ హయాంలో వ్యవసాయ సాగు రంగం ఎక్కడేసిన గొంగళి అక్కడేలా చతికిల పడిందని అన్నారు. ఈ బీడు పడ్డ దుస్థితి నుంచి వ్యవసాయ రంగాన్ని కాపాడేందుకు 2014 నుంచి తమ ప్రభుత్వం కీలక చర్యలకు దిగిందని చెప్పారు.