ఈ మధ్యకాలంలో సినిమాల్లో అడెల్ట్ కంటెంనట్ క్రమంగా పెరిగిపోతుంది. ఇంతకాలం వెబ్ సిరీస్‌లకు పరిమితమైన ఈ అడల్డ్ కంటెంట్ ఇప్పుడు సినిమాకు వచ్చేస్తుంది. సెన్సార్ బోర్డు అలాంటి సినిమా కత్తిరింపులు వేస్తున్నా.. మరికొన్ని సినిమాలకు మాత్రం ‘ఎ’ సర్టిఫికేట్ తీసుకొని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి సినిమా ఒకటి ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.
‘35’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న విశ్వదేవ్ హీరోగా, బింధుమాధవి హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘డార్క్ చాక్లెట్’. ఈ సినిమాని శశాంక్ శ్రీవాస్తవ్య దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్‌లో బూతు సన్నివేశాలు లేకపోయినా.. బూతులు మాత్రం గట్టిగానే ఉన్నాయి. ఇక పోతే ఈ చిత్రాన్ని ప్రముఖ హీరో రానా దగ్గుబాటి నిర్మించడం విశేషం. రానా ఇలాంటి సినిమా ప్రొడ్యూస్ చేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. టీజర్‌లో ‘కిడ్స్ పక్కకెళ్లి ఆడుకోండి’, ‘పాన్ మసాలా మూవీ’, ‘జానర్ అడగొద్దు’ వంటి క్యాప్షన్లు ఆసక్తిని కలిగిస్తున్నాయి. అంతేకాక చిత్రం విడుదల తేదీ ఆక్టోబర్ 31, నవంబర్ 14, డిసెంబర్ 5 తేదీలను పేర్కొని.. ఏ తేదీ కావాలో మీరే నిర్ణయించుకోమన్నారు. మరి టీజర్ చూపించినట్లే సినిమాలో కూడా బూతులు ఉంచుతారా.. అనేది వేచి చూడాలి.