వరంగల్: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వరంగల్ జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ కాంగ్రెస్ నేత కొండ మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జిల్లాలో పొంగులేటి పెత్తనం ఏంటని ఆయన ప్రశ్నించారు. దీనిపై మురళి ఎఐసిసికి ఫిర్యాదు చేశారు. కొండ సురేఖ శాఖ అయిన దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యంపై ఆయన ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారని.. మేడారం టెండర్ల వ్యవహారంపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పొంగులేటి సొంత కంపెనీలకు టెండర్ల పనులు ఇప్పించుకున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఆయన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు రాష్ట్ర వ్యవహారల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌కు సైతం ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో హైకమాండ్ నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు కొండ మురళి తెలిపారు.