అమరావతి: అనకాపల్లి జిల్లా పరవాడ ముత్యాలమ్మ పాలెంలో మత్స్యకారుడు గల్లంతయ్యాడు. మత్యకారుడు సముద్రంలో చేపల వేటకు వెళ్లాడు. తెల్లవారుజామున తెప్పపై ఆరుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. వారిలో ఒకరికి బలమైన కెరటం తగలడంతో గల్లంతయ్యాడు. మత్యకారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే అర్జులి బంగారురాజు(18) గా గుర్తించారు. గల్లంతైన మత్సకారుడు కోసం మైరన్ పోలీసులు, మత్స్యకారులు గాలిస్తున్నారు.