అమరావతి: వేడి వేడి టీ ఓ బాలుడి ప్రాణాలు తీసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా యాడికిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… చెన్నకేశవ స్వామి కాలనీలో రామస్వామి-చాముండేశ్వరి అనే దంపతలులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు యశస్వి(2), హృతిక్(4) అనే పిల్లలు ఉన్నారు. ప్లాస్క్‌లో తల్లి వేడి టీ పోసి ఉంచింది. నీళ్లు ఉన్నాయనుకొని హృతిక్ ప్లాస్క్‌లోని టీని తాగాడు. తీవ్ర గాయాలు కావడంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఎన్‌ఐసియులో చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు. కుమారుడు అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు కన్నీంటిపర్యంతమయ్యారు. ఆ కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి.