హైదరాబాద్: ప్రపంచ మార్కెట్లకు టీషర్టులు ఎగుమతి చేయడం సంతోషంగా ఉందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ’ వ్యవసాయం నుంచి ఫ్యాషన్’ నినాదంతో టెక్ టైల్స్ పార్కు స్థాపించామన్నారు. వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్కులో ఉత్పత్తిపై కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వరంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాకతీయ టెక్స్ టైల్స్ పార్కులో 2023లో ఫ్యాక్టరీలకు,11 యంగ్ వన్ కార్పొరేషన్ ఫ్యాక్టరీలకు శంకుస్థాపన చేశామని తెలియజేశారు. అన్ని యూనిట్లు ప్రారంభమైతే వరంగల్ ప్రధాన వస్త్ర కేంద్రంగా మారుతోందని కెటిఆర్ ప్రశంసించారు.