అమరావతి: దంపతుల మధ్య గొడవలు జరగడంతో భర్త చేయి కోసుకొని బావిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లె జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్నాటక రాష్ట్రానికి చెందిన చెంగాచారి(26) గోల్డ్ స్మిత్‌గా పని చేస్తున్నాడు. అతడి సోదరి శోభారాణి మదనపల్లెలో ఉంటుంది. చెంగాచారి తన భార్య శశి, కుమారుడితో కలిసి సోదరి ఇంటికి మదనపల్లెకు వచ్చింది. చెంగాచారి, శశి మధ్య జరిగిన గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చి మడికయ్యల శివాలయం సమీపంలోకి చేరుకున్నాడు. చేయిని కత్తితో కోసుకొని బావిలో దూకాడు. బావిలో నీళ్లు లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. బావిలో నుంచి కేకలు వినపడడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎఆర్ కానిస్టేబుల్ అమర్‌నాథ్ తన పిల్లలను స్కూలుకు తీసుకెళ్తుండగా బావి దగ్గర జనాలు గూమికూడారు. వెంటనే కానిస్టేబుల్ అక్కడికి వెళ్లి తాడు సహాయంతో అతడిని బయటకు తీశాడు. అనంతరం అతడు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఎస్‌పి ధీరజ్ సదరు కానిస్టేబుల్‌ను ఆభినందించడంతో పాటు రివార్డు కూడా ప్రకటించాడు. పోలీసులు ప్రజల ప్రాణాలు రక్షించడానికే ఉన్నారని ఎస్‌పి తెలిపారు.