గౌహతి: ప్రపంచ జూనియర్ మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత్ కాంస్య పతకం సా ధించి చరిత్ర సృష్టించింది. శుక్రవారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇండోనేసియాతో జరిగిన తొలి సెమీ ఫైనల్లో భారత్ ఓటమి పాలైంది. సెమీస్‌లో ఇండోనేసియా 4535, 4521 తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో పరాజయం పాలు కావడంతో భారత్ కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
కాగా, ప్రపంచ జూనియర్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో ఓ పతకం గెలుచుకోవడం భారత్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. అస్సాంలోని గౌహతిలో జరిగిన ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌తో పాటు పలు అగ్రశ్రేణి జట్లు పోటీ పడుతున్నాయి. కాగా రెండో సెమీ ఫైనల్లో 14 సార్ల ఛాంపియన్ చైనా జయకేతనం ఎగుర వేసింది. జపాన్‌తో జరిగిన సెమీస్‌లో చైనా 4542, 3845, 4542 తేడాతో విజయం సాధించింది.