హీరో ప్రియదర్శి ప్రస్తుతం రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ నిర్మాణంలో రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘ప్రేమంటే’తో రాబోతున్నారు. ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ నిర్మిస్తోంది. స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ సింగిల్ ’దోచావే నన్నే’ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు. లియోన్ జేమ్స్ స్వరపరిచిన ఈ రొమాంటిక్ ట్రాక్ అదిరిపోయింది. అబ్బీ వి వాయిస్ ఈ పాటకు ప్రాణం పోసింది. శ్రీమణి రాసిన సాహిత్యం హార్ట్ టచ్చింగ్ వుంది. ప్రియదర్శి, ఆనంది కెమిస్ట్రీ చాలా సహజంగా, హృదయానికి హత్తుకునేలా ఉంది.