భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన మహిళల వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా గురువారం విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మంధాన అత్యంత అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల వన్డే క్రికెట్‌లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా మంధాన రికార్డు సృష్టించింది. ఈ ఏడాది మంధాన ఇప్పటి వరకు 17 ఇన్నింగ్స్‌లు ఆడి 982 పరుగులు చేసింది. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా మంధాన నిలిచింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు బెలిండా క్లార్క్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న 970 పరుగుల రికార్డును మంధాన తిరగ రాసింది. క్లార్క్ 1997లో ఈ రికార్డు సాధించింది.