తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్‌ల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జిఓ 9పై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. రెండు రోజులుగా కొనసాగిన ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు గురువారం జిఓ 9పై స్టే విధిస్తూ తీర్పు వెల్లడించింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలు తెలుపేందుకు పిటిషనర్లకు రెండు వారాల గడువు ఇచ్చింది న్యాయస్థానం. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఆరు వారాలకు వాయిదా వేసింది.
బిసి రిజర్వేషన్లతోపాటు ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల నోటిఫికేషన్ పై కూడా కోర్టు స్టే విధించింది. దీంతో స్థానిక ఎన్నికలకు బ్రేకు పడింది. దీనిపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందోనని అందరిలో చర్చ నెలకొంది.