అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రామం గొల్లవీధిలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి గోడ కూలి మహిళ మృతి చెందింది. గోడ కూలిన ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గొల్లవీధిలో నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలి పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలకు వెళితే స్థానికులు గోడ శిథిలాల కింద మరికొందరు ఉండొచ్చనని అనుమానం వ్యక్తమవుతున్నాయి.