మాడ్గుల: రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లిలో పిడుగుపాటు రైతు మృతి చెందాడు. అప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన అల్లి బుచ్చయ్య(50) అనే రైతు వ్యవసాయ పొలంలో పని చేస్తున్నాడు. ఉరముల మెరుపులతో భారీ వర్షం పడుతోంది. బుచ్చయ్య గడ్డి కోస్తుండగా అతడిపై పిడుగు పడడంతో ఘటనా స్థలంలోనే చనిపోయాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు శోఖసంద్రంలో మునిగిపోయారు. అప్పారెడ్డిపల్లి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.