మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరా బాద్‌లోని జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి నవంబర్ 11న జరగబోయే ఉప ఎన్నికకు తన అభ్యర్థిగా అధికార కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్‌ను ఎంపిక చేసింది. ఈ మేరకు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ బుధవారం రాత్రి ఢిల్లీలో ప్రకటన విడుదల చేశారు. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు ఖర్గే ఆమోదించినట్లు కె.సి.వేణుగోపాల్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొ న్నారు. పోటీ నుంచి బొంతు రాంమోహన్ తప్పుకోవడంతో నవీన్‌కు మార్గం సుగమమైంది