కొచ్చి: కేరళ లగ్జరీ కార్ల ప్మగ్లింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వేగం పెంచింది. పలువురు నటులు, ఏజెంట్ల నివాసాలపై దాడులకు దిగింది. బుధవారం ఈ కేసుతో సంబంధం అనుమానాలతో నటులు పృధ్వీరాజ్ సుకుమారన్, దుల్కీర్ సలామాన్, అమిత్ చక్కలకల్ మరికొందరి నివాసాలపై సోదాలు నిర్వహించారు. భూటాన్ నుంచి ఇండియాకు కార్ల స్మగ్లింగ్ కేసుకు సంబంధించి కేరళ, తమిళనాడులలో ఇడి విస్తృతస్థాయి దాడులు సోదాలు సంచలనానికి దారితీశాయి. కొందరు వాహనాల ఓనర్లు, కార్ల రిపేర్ల షాపులు, ఎర్నాకులంలోని వ్యాపారుల ఆఫీసులు, నివాసాలపై కూడా ఇడి విరుచుకుపడింది.