నల్లగొండ జిల్లా, హాలియా ఎస్‌బిఐ శాఖలో మంగళవారం రాత్రి విద్యుఘాతంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బ్యాంక్ మేనేజర్ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్థరాత్రి షార్ట్‌సర్కూట్ చోటుచేసుకోవడంతో బ్యాంకులో ఉన్న రెండు కంప్యూటర్లు, రెండు ఎసిలు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిబూడిదయ్యాయి. స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో వెంటనే సిబ్బంది, ఎస్‌ఐ సాయిప్రశాంత్ ఆధ్వర్యంలో పోలీసులు ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పివేశారు. ఈవిషయంపై బ్యాంక్ ప్రధాన కార్యాలయ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు బ్యాంక్ మేనేజర్ తెలిపారు. ఇదిలాఉండగా ఎసి మిషన్ ద్వారానే షార్ట్ సర్కూట్ అయి ప్రమాదం జరిగి ఉండొచ్చని అగ్నిమాపక అధికారులు అంచనా వేస్తున్నారు.