హైదరాబాద్: జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల ప్రక్రియ గురువారం(అక్టోబర్ 9) ప్రారంభం కానుంది. తొలి విడత జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు గురువారం రిటర్నింగ్ అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. ఉదయం 10.30 నుంచి జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నామినేషన్‌లు స్వీకరిస్తారు. మొదటి విడత నామినేషన్లు ఈ నెల 11 వరకూ స్వీకరిస్తారు. మొదటి విడతలో 292 జడ్పిటిసి, 2,963 ఎంపిటిసిల స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
మరోవైపు బిసి రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ గురువారానికి వాయిదా పడింది. గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు హైకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. స్థానిక ఎన్నికలపై రేపు జారీ కానున్న నోటిఫికేషన్‌పై పిటిషనర్ స్టే కోరారు. అయితే పిటిషనర్ విజ్ఞప్తిని హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఎన్నికల షెడ్యూల్‌ని గెజిట్‌లో చేర్చారా అని హైకోర్టు ప్రశ్నించింది. అనంతరం హైకోర్టు ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది.