టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టిఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘వార్-2’. హృతిక్ రోషన్, ఎన్టిఆర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా.. ఆగస్టు 14వ తేదీన విడుదలైంది. అయితే ఈ సినిమా ఆశించినంత సక్సెస్ సాధించలేకపోయింది. తెలుగులో అయితే మరీ ఘోరమైన టాక్ వచ్చింది. హిందీలో ఓ మాదిరిగా కలెక్షన్లు వచ్చాయి. ఎన్టిఆర్ ఫ్యాన్స్‌ని అయితే ఈ సినిమా నిరాశ పరిచిందనే చెప్పుకోవాలి.
అయితే ఈ సినిమా త్వరలో ఒటిటిలో సందడి చేయనుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఒటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్‌లో విడుదలైన 8 వారాల తర్వాత ఒటిటిల్లో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం చేసుకున్నారు. దీంతో రేపటి(అక్టోబర్ 9) నుంచి ఈ సినిమా బుల్లితెరపై సందడి చేయనుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వార్-2 అందుబాటులోకి వస్తుందని ఒటిటి సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే వారం నుంచే ఇదే తేదీన ఈ సినిమా ఒటిటిలో వస్తుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమైంది. మరి థియేటర్‌లో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా.. ఒటిటిలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి?