హైదరాబాద్: బిసి రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. భోజన విరామం తర్వాత హైకోర్టులో ఇరు పక్షాలు తమ వాదనలు వినిపిస్తున్నాయి. 42 శాతం రిజర్వేషన్లకు శాస్త్రీయ ఆధారాలు చూపలేదని పిటిషనర్లు తెలిపారు. బిసి కులగణన చేశారు కానీ బహిర్గతం చేయలేని పిటిషనర్ల తరఫు న్యాయవాది అన్నారు. బిసి కులగణన ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లు అంటున్నారని.. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు మాత్రం 2011 జనాభా ఆధారం అంటున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల జనాభా పెరిగిందా? తగ్గిందా? ఆ లెక్కలు ప్రభుత్వం వద్ద లేవని అన్నారు. ఎస్సీ ఎస్టీల జనాభాను లెక్కలోకి తీసుకోకుండా బిసి రిజర్వేషన్లు ఎలా అని ప్రశ్నించారు. 2018లో 34 శాతం బిసి రిజర్వేషన్లను ఇదే కోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికల నిర్వహణకు మేం వ్యతిరేకం కాదని పిటిషనర్లు పేర్కొన్నారు. రాజ్యంగ విరుద్ధంగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రశ్నించారు.