మాస్ మహరాజా రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ‘మాస్ జాతర’. కొత్త దర్శకుడు భాను భోగవరపు ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పాటలు కుర్రాళ్లను షేక్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరొక పాటను విడుదల చేశారు.
‘చిట్టి చిలకా.. చిన్న మొలక’ అంటూ సాగే ఈ పాటను హేషం అబ్దుల్ వహాబ్, భీమ్స్ సిసిరోలియో పాడారు. దేవ్ పావర్ ఈ పాటకు సాహిత్యం అందించారు. శేఖర్ మాస్టర్ ఈ పాటను కొరియోగ్రాఫీ చేశారు. ఇక ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో రవితేజా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.