అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా రాయవరంలో బాణసంచా పరిశ్రమలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం