హైదరాబాద్: సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ లో పుట్టి పెరిగానని, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు, తనకు మధ్య ఎటువంటి దురుద్దేశం లేదని, మాకు పార్టీ సంక్షేమం గురించే ఆలోచన చేస్తున్నామని స్పష్టం చేశారు. తాను ఆ మాట అనకపోయినా పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం ఆయన బాధ పడిన దానికి తాను క్షమాపణలు కోరుతున్నానన్నారు. తనకు అలాంటి ఆలోచన లేదని, తాను ఆ ఒరవడి లో పెరగలేదని, కాంగ్రెస్ పార్టీ తనకు ఆ సంస్కృతి నేర్పలేదన్నారు. సామాజిక న్యాయానికి పోరాడే సందర్భంలో వ్యక్తిగత అంశాలు పక్కన ఉంచామని, సామాజిక న్యాయంలో బలహీనవర్గాల బిడ్డగా ఇవాళ సిఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో రాహుల్ గాంధీ సూచన మేరకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నామన్నారు. తామంతా ఐక్యంగా భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం పని చేస్తామని స్పష్టం చేశారు. లక్ష్మణ్ కు వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నానని, కరీంనగర్ లో మాదిగ సామాజిక వర్గంతో తాను కలిసి పెరిగానని, ఆ అపోహ ఉండవద్ధని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.