రంగారెడ్డి: రెండో భార్యను భర్త హత్య చేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వెంకన్నగూడానికి చెందిన జంగయ్య, రజితను పెళ్లి చేసుకున్నారు. దంపతుల మధ్య గొడవలు జరగడంతో రెండు సంవత్సరాల నుంచి భర్తకు భార్య దూరంగా ఉంటుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య రజితను భర్త జంగయ్య హత్య చేశాడు. చున్నీతో ఉరివేసి తలపై రాయితో కొట్టి చంపాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.