మణికొండ: రంగారెడ్డి జిల్లా మణికొండ మండలంలో పుప్పాల్ గూడలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. అక్రమ నిర్మాణాలను జెసిబిలతో కూల్చివేస్తుండగా స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతంగా మారింది. అడ్డుకున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. ఈ భూమిని కొంతమంది కబ్జా చేశారన్న హైడ్రాకు ఫిర్యాదు రావడంతో స్థానిక రెవెన్యూ అధికారులతో విచారణ చేయించింది. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని రుజువు కావడంతో వాటిని కూల్చివేస్తున్నారు.